. . . మాకు ఎవరి( అమెరికా) మధ్యవర్తిత్వం అవసరం లేదు
. . . ప్రధాని నరేంద్ర మోడీ
ఢిల్లీ, బతుకమ్మ:
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ప్రధాని నరేంద్రమోడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తన నివాసంలో త్రివిద దళాధిపతులు, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రత సలహాదారులు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా అదే స్థాయిలో కాల్పులతోనే జవాబు చెబుతుందన్నారు. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందన్నారు. ఉగ్రవాద చర్యలు జరుగకుండా ఉండాలంటే పీవోకేను భారత్ కు అప్పగించడం తప్ప పాకిస్తాన్ మరో గత్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో గానీ, పీవోకే అంశంలో ఎవరు మధ్యవర్తులు మాట్లాడవద్దని ప్రధాని మోడి అన్నారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంలో మాత్రమే పాకిస్తాన్ మాట్లాడితే చర్చిస్తామని మరే విషయంలోనూ చర్చలు జరిపే ఉద్దేశ్యం లేదన్నారు.
