28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రధాని, ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ పథకం అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా బోధన్ మున్సిపాలిటీకి రూ.18.7 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ప్రధాని మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం, చిన్న వ్యాపారుల కోసం ముద్ర లోన్‌లు, జీఎస్టీ తగ్గింపుతో ఉపశమనం కల్పించిందని తెలిపారు. ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాధవనగర్, అర్సపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, రోడ్లు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమయ్యాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వినోద్, పేరుక వెంకటేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏశాల సూరి, కోశాధికారి పప్పుల వేణు, కార్యదర్శి దేవకట్ట శివ, స్వప్నిల్, చరణ్, పాండవుల భూమన్న, రాజు, పడాల శ్రీను, కిరణ్, కళ్యాణ్, ప్రవీణ్, శివ, చిన్న, అనిల్ తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Painting of portraits of Prime Minister and MPs

More articles

Latest article