25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళపై అత్యాచారం చేసిన నిందితునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

  • హిందువుగా మారుతానని నమ్మించి మోసం చేసిన ముస్లిం యువకుడు
  • భారత శిక్షాస్కృతి సెక్షన్ 417 ప్రకారం ఒక సంవత్సరం జైలుశిక్ష

 

నిజామాబాద్, బతుకమ్మ : ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారతానని నమ్మించి అత్యాచారం చేసిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష,మోసం చేసినందున మరో సంవత్సరం సాదారణ జైలుశిక్ష విదిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన నలభై మూడు పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ నగర పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పదమూడు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, అన్నింటిని అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడు అయిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ పై మహిళను మోసం చేసి, పదే పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువు అయినట్లు నిర్దారించింది. ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందువుగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. భారత శిక్షాస్కృతి సెక్షన్ 417(మోసం చేయడం ) ప్రకారం ఒక సంవత్సరం సాదారణ జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష, సెక్షన్ 376(2)(ఎన్) అత్యాచారం చేసిన నేరానికిగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల సాదారణ జైలుశిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీష తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

  • ఐదు లక్షల పరిహారానికి సిఫార్సు..

బాధిత మహిళకు ఐదు లక్షల రూపాయల పరిహారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చెల్లించాలని జడ్జి హరీష తమ తీర్పులో సిఫార్సు చేశారు.

More articles

Latest article