ప్రధాని, ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ పథకం అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా బోధన్ మున్సిపాలిటీకి రూ.18.7 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ప్రధాని మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి...