30.2 C
Hyderabad

కరెంట్ షాక్ తో పెయింటర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో పెయింటర్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్(32) సీతారాంనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో పెయింటింగ్ పనుల కోసం భవనంపైకి వెళ్లడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయిండు. స్థానికంగా ఉండే విద్యుత్ శాఖ అధికారులకు, బల్ధియా అధికారులకు ఫిర్యాదు చేసినా విద్యుత్ లైన్లను తొలగించలేదని ఆరోపించారు. ఈ మేరకు 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article