పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి రావొద్దు

0 11,388
  • సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న పోస్టులు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలలో తన వాగ్ధాటితో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకునేందుకు తహతహలాడుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు వైరలవుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిలో ఏం చేశారో హైదరాబాద్ కే పరిమితమయ్యారని ఆర్మూర్ రావొద్దంటూ 9 ప్రశ్నలతో ఉన్న పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దని ఉన్న పోస్టును అటు అధికార కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత ఏడాది ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలిచిన తర్వాత కూడా పైడి రాకేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ అదేస్థాయిలో ఏడాది తర్వాత విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ప్రధానంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డ తనఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ప్రశ్నిస్తూ రూపొందించిన పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి గిరికిలు కొడుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా గెలువడానికి గెలిచిన తర్వాత ప్రజలకు వైద్య సేవల పేరిట పెట్టిన రూపాయి ఆసుపత్రి ఎక్కడ అనేది ప్రధానంగా ఉంది. యువతకు ఉపాధి ఎక్కడ అనే ప్రశ్నలు సందించారు. ఏడాదిలో ఊరికి పది ఇళ్ళను సొంత డబ్బులతో కట్టిస్తారు అని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. హిందువులు అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మీరు ఆలయాలకు విరాళాలు ఇచ్చారా అనే ప్రశ్నలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావొద్దని పేదలు అంటే అంత చులకన అని పోస్టులో ఉన్నాయి. ఉపాధి కోసం విదేశాలకు యువతను పంపుతానంటూ వారి సమాచారాన్ని తీసుకుని ఆగం చేశారని పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడుతున్నారని అందులో రాసుకొచ్చారు. ధనవంతులు రావొద్దంటారు, పేదవారు వస్తే సహాయం చేయవు అనేది కూడా పోస్టులో రాశారు. చివరకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రావొద్దంటున్న ఆర్మూర్ ప్రజలు అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సోషల్ మీడియా పార్టీ గ్రూపుల్లో పోస్టులు చేయడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.