24 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ :  వాహనదారులు రోడ్డు భద్రతానియమాలు పాటించాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వాహనదారులు బయటికి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వాహనం నడిపే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడొద్దని, మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై జగదీశ్, సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ , అశోక్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


National road safety rules should be followed

More articles

Latest article