వేల్పూర్, బతుకమ్మ :
తెలంగాణ పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ను చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పీఆర్టియు టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ పి. మోహన్ రెడ్డి,జి. కిషన్ ల సూచన మేరకు మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని లక్కోరా, పడగల్, పోచంపల్లి, అంక్సాపూర్, అంక్సాపూర్ వడ్డెర కాలనీ, కుకునూర్ , కోమన్ పల్లి, కొత్తపల్లి ( కె) , వెంకటాపూర్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 75 మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులచే సభ్యత్వం చేయించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల శాఖ అధ్యక్ష బోడ దేవానందం,ప్రధాన కార్యదర్శి సి .వి. నరసింహారావు,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్, టి. హరిచరణ్, కాంతయ్య, పతాని గంగాధర్, అంబుజా రాణి, దేవరాజు, విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రదేవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి రవీందర్, మండల అసోసియేట్ అద్యక్షులు ఏ. రాజేంద్ర, మండల కార్యదర్శి రాకేష్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు అంజలి తదితరులు పాల్గొన్నారు.
