29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల రక్తదానం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ జిల్లా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్‌లో రక్త కొరత పై స్పందన 

 బతుకమ్మ బోధన్:

బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిల్వల కొరత ఉన్నదని సమాచారం అందిన వెంటనే హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ తక్షణమే స్పందించింది. మంగళవారం వారి సభ్యులు ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు చిత్రాల ప్రమోద్ కుమార్ చిన్న మాట్లాడుతూ, రక్తదానం ఓ మహత్తరమైన సేవ. ప్రతి యువకుడు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనాలి. ఒక్కరక్తపు బ్యాగ్‌తో ఒక్క ప్రాణాన్ని రక్షించవచ్చు. అందరూ ప్రాణదాతలుగా నిలవాలి,” అని పిలుపునిచ్చారు.రక్తదానం చేసిన సభ్యులకు ఆసుపత్రి వైద్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Blood donation by Helping Hands members

More articles

Latest article