23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పొంగిన చెక్ డ్యాములు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ఉగ్రరూపం దాల్చింది. అధికంగా నీరు రావడంతో వాగు పై నిర్మించిన చెక్ డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సుంకేట్, ధర్మోరా, గాండ్ల పేట్,  వెంచిర్యాల్ గ్రామాల వద్ద నిర్మించిన చెక్ డ్యాములు చిలకల సంతరించుకొని ప్రవహిస్తున్నాయి. గోదావరి వరవాళ్లు తొక్కడంతో తడపాకల్ లో ఉన్న ఆలయం వరదలో మునిగింది. దొనకల్ ధర్మవరం గ్రామాల మధ్య గుండాగు నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెద్ద  వాగు పరిసర ప్రాంతాల ప్రజలు వాగు ప్రాంతాలకు వెళ్ళకూడదు అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Overflowing check dams

More articles

Latest article