. . . నిజామాబాద్ పేరును ఇందూర్ గా మార్చాలి
. . . నిజామాబాద్ లో హైడ్రాను అమలు చేస్తే స్వాగతిస్తాం
… అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
తెలంగాణలో అతిపెద్ధ ప్రాచీన యూనివర్సిటి ఉస్మానియా యూనివర్సిటీని ప్రముఖ స్వాతంత్ర సమర యోదుడు, సంపాధకులు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ డిమాండ్ చేశారు. భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కింద మంత్రిమండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ పేర్లు పెట్టడం స్వాగతిస్తున్నాం అని కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టిశ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలనీ సూచించారు.ఎందుకంటే పొట్టిశ్రీరాములు ఒక రాష్ట్ర నాయకులు కాదు జాతీయ నాయకులు స్వతంత్ర పోరాటంలో గాంధీగారితో కీలక పాత్ర పోషించిన వ్యక్తి,దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలనీ నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అన్నారు. ప్రతేక ఆంధ్రరాష్ట్రము కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అలాంటి జాతీయ నాయకుని పేరు మార్చడం అనేది స్వాతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించడమే అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు వారి మనోభావాలు దెబ్బతినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేర్ల మార్పు పై నేను అసెంబ్లీలో ప్రస్థావించినట్లుగా హైదరాబాద్ ను భాగ్యనగర్ గా , నిజామాబాదును ఇందూర్ గా ,ఆదిలాబాద్ ను ఎదులాపురం గా మహబూబ్ నగర్ ను పాలమూరు గా, మహబూబాబాద్ ను మానుకోట , వరంగల్ ను ఓరుగల్లు గా జిల్లాల పేర్ల మార్పు పై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశం అయ్యి ఆమోదం తెలపాలని కోరారు. హైద్రాబాద్ లో చెరువుల, కుంటలు, నాళాల కబ్జాలను తోలిగించేందుకు చెపట్టిన హైడ్రాను నిజామాబాద్ లో అమలు చేస్తే స్వాగతిస్తామని అర్బన్ ఎమ్మెల్యే అన్నారు.

