జుక్కల్, బతుకమ్మ: కౌలాస్ నాలా ప్రాజెక్టు 565 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458(1.237 టీఎంసీలు) మీటర్లు కాగా, ప్రస్తుతం 457.85(1.201 టీఎంసీలు) మీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ఒక గేటు ద్వారా 883 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. వరద నీరు బయటకు విడుదల చేశామని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు.
