నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: భరత మాత నుదుట ఉగ్రవాదుల రక్తంతో తిలకం దిద్దేందుకే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైన్యానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడని కోరుతూ నీలకంఠేశ్వరాలయంలో ఎమ్మెల్యే గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వైపు శత్రు దేశాలు కన్నెత్తి చూడాలనుకున్నా, ఒక్క భారతీయుడిని ముట్టుకోవాలన్నా ప్రస్తుత యుద్ధం ప్రధాన మోడీ హెచ్చరిక అని అన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది అర్బన్ నక్సలైట్లు ఆపరేషన్ సిందూర్ ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని వారికి సమాధానం ఇస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు జీ హుజూర్ అనేందుకు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు.
యుద్ధ సమయంలో దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

