భరత మాతకు వీర తిలకం దిద్దేందుకే ‘ఆపరేషన్ సిందూర్’
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: భరత మాత నుదుట ఉగ్రవాదుల రక్తంతో తిలకం దిద్దేందుకే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైన్యానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడని కోరుతూ నీలకంఠేశ్వరాలయంలో ఎమ్మెల్యే గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వైపు శత్రు దేశాలు కన్నెత్తి చూడాలనుకున్నా, ఒక్క భారతీయుడిని ముట్టుకోవాలన్నా ప్రస్తుత యుద్ధం ప్రధాన మోడీ హెచ్చరిక అని అన్నారు. ఇక్కడ...