ధాన్యం కొనుగోలు  కేంద్రం ప్రారంభం

0 2,173

ఏర్గట్ల, బతుకమ్మ: మండలంలోని తాళ్ల రాంపూర్ లో ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో ధాన్నయం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి  శుక్రవారం మండల వ్యవసాయాధికారి సాయిసచిన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం సూచించిన ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొరిపెల్లి లింగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు సోమదేవారెడ్డి, దేశబోయిన సంజీవ్, బద్దం రవీందర్, ఏర్గట్ల పీఏసీఎస్ చైర్మన్ బర్మచిన్న నర్సయ్య, సహకార అధికారి దేవేందర్, సభ్యులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.