ప్లాగ్ డే సంధర్బంగా విద్యార్ధులకు ఆయుదాల వినియోగంపై అవగాహన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవముల సందర్భంగా పోలిస్ శాఖ విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించింది. ప్లాగ్ డే ను పురస్కరించుకోని పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) కోటేశ్వర రావు, విద్యార్థినీలతో కలిసి ఓపేన్ హౌజ్ ను ప్రారంబించారు.
ఓపెన్ హౌజ్ కార్యాక్రమంలో కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ , ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిశిత డిగ్రీ మహిళా కాలేజీ విద్యార్థులకు 303 రైఫిల్, ఎస్. ఎల్. ఆర్. ఇన్సాస్, ఎ.కె. 47, 9 ఎమ్. ఎమ్ కార్బన్, గ్యాస్ గన్, యాంటి రైడ్ గన్, పిస్టల్, రివాల్వర్, గ్రెనేటు, ఎల్.ఎమ్.జి లాంటి ఆయుదాల వాడకంపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

నేర పరిశొధనలో పొలిసులు వినియోగించే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కమ్యూనికేషన్స్ విభాగాల గూరించి విద్యార్ధులకు వివరించారు. ఈ ఓపెన్ హౌజ్ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య, ఫారెన్సీక్ హెచ్.ఓ.డి డా॥ నాగమోహన్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి, శేఖర్, ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్ ప్రసాద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా లు పాల్గోన్నారు.
