రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
రుద్రూర్, బతుకమ్మ :
ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజేవ్ గాంధీ హనుమంతు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజేవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ గది, రోగులకు అందించే వైద్య సేవలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని ఆసుపత్రిలోని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారిణి డా. అయోషా సిద్ధికా, సూపర్ వైజర్ రవి కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.
