23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్/బ్యాక్ లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడెమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఆచార్య గంట.చంద్ర శేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 11238 విద్యార్థులకు గాను 10773 విద్యార్థులు హాజరయ్యారని, 464 మంది గైర్హాజరయ్యారని, కామారెడ్డి లోఒకరు డిబార్ అయ్యారని ఆయన తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష కు 4940 విద్యార్థులకు గాను 4766 మంది హాజరయ్యారని, 173 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన రెండవ సెమిస్టర్ రెగ్యులర్, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షకు  6298 విద్యార్థుల కు గాను 6007 మంది హాజరు కాగా 291 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. కామారెడ్డి లోని పలు పరీక్ష కేంద్రాలను చంద్రశేఖర్, సంపత్ కుమార్, ఆంజనేయులు తనిఖీ చేసారు.

 

Ongoing Degree Examinations

More articles

Latest article