కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్/బ్యాక్ లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడెమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఆచార్య గంట.చంద్ర శేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 11238 విద్యార్థులకు గాను 10773 విద్యార్థులు హాజరయ్యారని, 464 మంది గైర్హాజరయ్యారని, కామారెడ్డి లోఒకరు డిబార్ అయ్యారని ఆయన తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష కు 4940 విద్యార్థులకు గాను...