. . . కాకతీయకు నీటి విడుధల నిలిపివేత
. . . కోనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
బాల్కోండ, బతుకమ్మ:
బాల్కోండ మండలం రెంజర్ల గ్రామం వద్ధ ఒ వ్యక్తి కాకతీయ ప్రధాన కాలువ ( ఎల్ఎండి) లో వ్యక్తి గల్లంతు అయ్యాడు. దానితో కాకతీయ కాలువకు నీటి విడుథల నిలిపివేశారు. ఈ సంఘటన బుదవారం ఉదయం జరిగింది. బాల్కోండ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన జగదీష్ ( 56) బుదవారం ఉదయం కాకతీయ ప్రధాన కాలువలో గల్లంతు అయ్యాడు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఆర్ఎస్పి అధికారులు కాకతీయ కాలువకు నీటివిడుధల నిలుపుధల చేశారు. జగదీష్ కోసం గాలింపు చర్యలు చెపట్టారు. స్థానికంగా ఓకప్పుడు హోటల్ నిర్వహించిన జగదిష్ ప్రస్తుతం ఇంటిలోనే కిరాణ దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. జగదీష్ కాలువలో గల్లంతుకు ప్రమాదవశాత్తు జరిగిందా లేక అత్మహత్య యత్నం చేశాడా తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు నీటి విఢుథల చేయమని అధికారులు తెలిపారు.