ఒకరికి ఏడేళ్ళ కఠిన జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వేయి రూపాయల కోసం వ్యక్తిని కత్తితో పోడిచి చంపిన నిందితుడికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల గురువారం తీర్పు వెలువరించారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు...కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన సమీఉద్దీన్, వసిమోద్దీన్ అన్నదమ్ముల కొడుకులు. ఇద్దరు పూల దుకాణంలో పనిచేసేవారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలు విక్రయించే ముస్తఫా ఖాన్ దగ్గర పనిచేస్తుండే వాడు వసిముద్దీన్ తన ఆర్థిక అవసరాలకు...