27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హత్యాయత్నం కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పోశెట్టి పై హత్యయత్నం కేసు రుజువు అయినట్లు నిర్ధారిస్తూ, అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయి సుధ మంగళవారం తీర్పు ఇచ్చారు.వివరాలు పోశెట్టి సింగంపల్లి గ్రామస్తులతో మాటిమాటికి అకారణంగా లొల్లి పడుతుండేవాడు.ఈ విషయంలో గ్రామస్థులు ఎంత నచ్చజెప్పిన వినకుండా అలాగే ప్రవర్తించేవాడు. స్వంత కులస్థులతో కూడా అదే మాదిరిగా ఉంటు లొల్లి లు చేసేవారు. పోశెట్టి తమ్ముడు మోహన్ 24 ఏప్రిల్,2022 న స్వంత ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో ఉండగా అక్కడికి వెళ్లి తమ్ముడిని ఉద్దేశించి నిన్ను, చిన్నాన్న భూమయ్య ను చంపేస్తానని బెదిరించాడు.మోహన్ ఊరి మధ్యలో బైక్ పై వెళ్తుండగా గ్రామస్థుడైనా నీలకంఠ రవి ఎదురుకావడం పోశెట్టి చంపివేస్తానన్న బెదిరింపులను చేశాడు. నేను నచ్చజేబుతా పదమంటూ ధైర్యం చెప్పి ఇద్దరు బైక్లపై వెళ్ళాసాగారు. పోశెట్టి ఎదురుగా బైక్ పై వస్తు వేగంగా మోహన్ బైక్ కు టక్కర్ ఇవ్వడంతో కింద పడ్డారు. వెంటనే పోశెట్టి తన దగ్గర ఉంచుకున్న చాకుతో మోహన్ తలపై పొడవబోయాడు అడ్డు పడిన రవి తన చేతులు అడ్డుపెట్టగా తీవ్ర గాయాలు అయ్యాయి. నేర అభియోగాలు కోర్టు నేర విచారణలో రుజువు అయినట్లు నిర్దారిస్తూ పోశెట్టికి హత్యయత్నం నేరంకుగాను రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధిస్తూ జడ్జి సాయి సుధ తీర్పునిచ్చారు. కోర్టు జారీ చేసిన కన్విక్షన్ వారంట్ తీసుకున్న పోలీసులు పోశెట్టి ని నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. మోపాల్ పోలీసుల తరపున డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య ప్రాసిక్యూషన్ నిర్వహించారు

More articles

Latest article