హత్యాయత్నం కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పోశెట్టి పై హత్యయత్నం కేసు రుజువు అయినట్లు నిర్ధారిస్తూ, అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయి సుధ మంగళవారం తీర్పు ఇచ్చారు.వివరాలు పోశెట్టి సింగంపల్లి గ్రామస్తులతో మాటిమాటికి అకారణంగా లొల్లి పడుతుండేవాడు.ఈ విషయంలో గ్రామస్థులు ఎంత నచ్చజెప్పిన వినకుండా అలాగే ప్రవర్తించేవాడు. స్వంత కులస్థులతో కూడా అదే మాదిరిగా ఉంటు లొల్లి లు చేసేవారు. పోశెట్టి తమ్ముడు మోహన్ 24...