చోరీ కేసులో ఒకరి రిమాండ్

0 1,277
  • 50 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం

 

ఎల్లారెడ్డి,  బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని దేవునిపల్లి, కొట్టాల గ్రామాల్లో గత సంవత్సరం డిసెంబర్ నెల 16న  అర్ధరాత్రి ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మెదక్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఈ దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. ఇతని వద్ద నుంచి సుమారు 50 తులాల వెండి ఆభరణాలు స్వాధీన చేసుకున్నారు. నిందితున్ని కామారెడ్డి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ దర్యాప్తుకు కృషి చేసిన ఎస్ఐకి సహకరించిన పోలీస్ కానిస్టేబుళ్లు ఇద్రిస్, వెంకటరమణ, ప్రసాద్ లను పై అధికారులు అభినందించారు.

One remanded in theft case

Leave A Reply

Your email address will not be published.