24.1 C
Hyderabad
Monday, August 3, 2026

వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రుడెన్స్ హాస్పిటల్ ఎదుట బంధువుల ధర్నా

One person dies due to medical negligence

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వైద్యుల నిర్లక్ష్యంలో ఒకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ లో గల  ప్రుడేన్స్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మెడికల్ రిప్ గా పనిచేసే సాయికుమార్ (26) తన బంధువు హైదరాబాద్ నుండి వస్తున్నాడని కారులో అతనిని తీసుకురావడానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో బిక్నూర్ మండలం జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు.

One person dies due to medical negligence

అతనితో పాటు ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా సాయికుమార్ అనే వ్యక్తిని నిజామాబాద్ ప్రూడేన్స్ హాస్పటల్లో చేర్పించారు. అతని చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకొని ట్రీట్మెంట్ ప్రారంభించారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఒక విధంగా దిగ్భ్రాంతి చెంది హాస్పటల్ వర్గాలను నిలదీయగా సమాధానం చెప్పడానికి చాటేసినారు. ఈ విషయంలో మృతుడి బంధువులు, అతనితో పనిచేసే మెడికల్  రిప్రజెంటివ్ సంఘం సభ్యులు ఆసుపత్రి చేరుకొని ధర్నాకు దిగినారు. భాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు నాయకులు నూర్జాహన్, కఠారి రాములు మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు రషీదా బేగం, టిడిపి అధికార ప్రతినిధి పురుషోత్తం, తెలంగాణ మెడికల్ రిప్రజెంటీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తో పాటు మెడికల్ రిప్ లు పాల్గొన్నారు.

One person dies due to medical negligence

More articles

Latest article