- బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్, బతుకమ్మ : ఒకే దేశం ఒకే ఎన్నిక పెట్టడం వలన దేశం అభివృద్ధి చెందితుందని బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో ఒకే దేశం – ఒకే ఎన్నిక విషయాలపై కార్యకర్తలకు కార్యశాల (వర్క్ షాప్) పై దిశా నిర్దేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు పెట్టడం వల్ల దేశ అభివృధి జరుగుతుందన్నారు. నాయకులు అభివృద్ధి పైన దృష్టి పెడతారని, ఇప్పటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందన్నారు. ఇక పైన భారతీయులు అందరం కుల, మత బేధాలు లేకుండా ఐక్యతగా ఉండి ఈ ఒకే దేశం ఒకే ఎన్నికను నిర్వహిస్తే గనుక భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచానికి తెలియజేయ వచ్చని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరు ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రజలకు అవగాహనా కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శత జయంతి ఉత్సవాల కన్వీనర్ ప్రశాంత్ గౌడ్, కో కన్వీనర్ కుమ్మరి గణేష్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, జీలకర్ర విజయ్, బోజిగొండ అనిల్, మండల కమిటీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
