24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్‌లో ఘనంగా లక్ష తమలపాకుల పూజ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని శ్రీ మారుతి మందిరంలో మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో సామూహిక లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ మహాపూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా పూలతో  ముస్తాబై భక్తిపూరిత వాతావరణం నెలకొంది. స్థానిక పూజారి ప్రవీణ్ మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శాంతి పఠనాలు నిర్వహించగా, మహిళలు, చిన్న పిల్లలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఆలయ కమిటీ సభ్యులు, సేవాదళ సభ్యులు భక్తులకు సేవలందించడంలో ఎనలేని కృషిఇట్టి కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి రాములు, అర్చకులు మధు ఆలయల కమిటీ అధ్యక్షులు గుండేటి శంకర్, హరికాంత్ చారి, జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గుప్తా, ఎసిపి శ్రీనివాస్ సిఐ వెంకటరమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంకు దాము, ప్రముఖులు కనయ్య, విజయ్, నర్సింలు, రవి గౌడ్ ఆలయ పాలక కమిటీ సభ్యులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, శ్రావణ మాసంలో లక్ష తమలపాకుల పూజ నిర్వహించడం,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు.

One lakh betel leaves are worshipped in Bodhan

More articles

Latest article