బోధన్‌లో ఘనంగా లక్ష తమలపాకుల పూజ
బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని శ్రీ మారుతి మందిరంలో మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో సామూహిక లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ మహాపూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా పూలతో ముస్తాబై భక్తిపూరిత వాతావరణం నెలకొంది. స్థానిక పూజారి ప్రవీణ్ మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శాంతి పఠనాలు నిర్వహించగా, మహిళలు, చిన్న పిల్లలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఆలయ కమిటీ...