నలుగురు టీచర్ల ఒక రోజు వేతనం కట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఫూలాంగ్ యూపీఎస్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఉపాధ్యాయుల వేతనంలో ఒక రోజు కోత విధిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి ఫూలాంగ్ యూపీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా స్కూల్ అసిస్టెంట్ భారతి, ఎస్జీటీలు పద్మావతి, విజయశాంతి, కరుణ శ్రీ పాఠశాలలో లేకపోవడంతో డీఈవో ఆరా తీసి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు నోటీసులకు ఇచ్చిన సమాధానం మేరకు ఒక రోజు...