24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బట్టాపూర్ లో నాడు కంకర క్వారీ.. నేడు ఇసుక క్వారీ

Must read

📰 Generate e-Paper Clip

  • అక్రమ తవ్వకాలు రవాణా పై చేతులెత్తేసిన అధికార యంత్రాంగం
  • ఖనిజా అభివృద్ది సంస్థ చైర్మెన్ ఇలాఖాలో సహజ వనరుల దోపిడీ
  • ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న కాంగ్రెస్ నేతలు
  • మౌనం దాల్చిన ప్రతి పక్షాలు

 

నిజామాబాద్, బతుకమ్మ:

బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ పెద్ధ వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతుంది. అభివృద్ది పనులు, ఇళ్ల నిర్మాణాల కోసం వే బిల్లులు రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్నారు. ఇసుక రీచ్ లు గుర్తించి మైన్స్ అధికారులు చేతులు దులుపుకున్నారు.  రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈర వత్రి అనీల్ సొంత నియోజకవర్గంలోనే ఇసుక దోపిడీ కలకలం రేపుతోంది. సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయలేని వారు  ఇతర ప్రాంతాలలో సహజ సంపద దోపిడీని ఎలా అడ్డుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేసి రవాణాలో గ్రామా వీడీసీ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఒక్కో ట్రాక్టర్ నుంచి వీడీసీ రూ.50 వేలు వసూలు చేసినట్లు తెలిసింది.

నాడు బట్టాపూర్ కంకర క్వారీ అక్రమ తవ్వకాలపై కాంగ్రెస్, బీజేపీలు ఆందోళనలు, నిరసనలు చేశాయి. బీజేపీ నేత మల్లిఖార్జున్ రెడ్డి ఆందోళన చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించి జరిమాన విధించేలా చేయడంలో సఫలం అయ్యారు. ఈనాడు అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ నేతలు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని బట్టాపూర్ లో ఇప్పుడు ఇసుక తవ్వకాలు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ మౌనంపై చర్చ జరుగుతుంది. వీడీసీ ముసుగులో మిగిలిన ప్రధాన పార్టీల ఇసుక దందాలో ప్రమేయం ఉందనేది జగమెరిగిన సత్యం గా చెబుతున్నారు స్థానికులు.  నాడు ప్రతిపక్షాలు అక్రమ తవ్వకాల విషయంలో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని టార్గేట్ చేస్తే నేడు కాంగ్రెస్ నేతల అండదండలతో జరుగుతున్న ఇసుక దందాపై బీఆర్ఎస్ మౌనంపై చర్చ జరుగుతుంది.

బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రెవిన్యూ, పోలీస్ శాఖలు చేతులేత్తేశాయి. ఇక  మైనింగ్ అధికారులు సిబ్బంది కొరత పేరిట తప్పించుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు అస్త్ర సన్యాసం చేశాయి. బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఎవ్వరైన ప్రశ్నిస్తున్నారు అంటే  అధికార కాంగ్రెస్ నేతలే. బాల్కొండ నియోజకవర్గంలో మూడు గ్రూప్ లు ఉన్నాయి. ఈరవత్రి అనిల్, ముత్యాల సునీల్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డిలకు ఎవ్వరికి వారికి గ్రూప్ లు ఉన్నాయి. ఎవ్వరికి వారు నియోజకవర్గంపై పెత్తనానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుకాసురుల వెనుక ఉన్నది నీవు అంటే నీవు అని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వేదికగా యుద్ధం జరుగుతుంది. కాని ఈ అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా మాత్రం ఆగడంలేదు.

Once a gravel quarry in Battapur.. today a sand quarry

More articles

Latest article