25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓ పెద్ద సార్లు.. మా ఘోస వినరేంది..

Must read

📰 Generate e-Paper Clip

  • చిటికి మాటికి డ్రైవర్లను, కండక్టర్ లను టార్గేట్ చేస్తున్న కంట్రోలర్ లు
  • టార్గేట్ లు చేరడం లేదని వేధింపులు
  • ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఆవేదన

 

నిజామాబాద్, బతుకమ్మ :  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదనకు గురై అవస్థల పాలు అవుతున్నారు. మహాలక్ష్మి స్కీం ఏమో కానీ తమ ఉద్యోగాల మీద ప్రమాదకరంగా మారి తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నారు. చిన్న తప్పిదాలకు తమను అధికారులు కలిచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో వ్యక్తి తమకు బస్సు ఆపలేదని ఫోన్ చేయడం గానీ, ఆధార్ కార్డు సరిగా లేకపోయినా, బస్సులో నుంచి తొమ్మిది తగ్గిన చీటికిమాటికి డిపో అధికారులకు ఫోన్ చేస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఇటీవల ఓ బస్ డిపోలో ఓ కండక్టర్ ను కంట్రోలర్ బస్సు తీయాలని నీకు తెలియదా అంటూ కండక్టర్ పై బూతు పురాణం పెట్టినట్లు వాపోయారు. ఓ డ్రైవర్ అస్వస్థతకు గురై ముక్కు నుండి రక్తం రావడంతో డ్రైవర్ కిటికీలో నుండి ముక్కు చీదితే ప్రయాణికులు డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చారు. ఓ ప్రాంతంలో బస్సు ఆపడం లేదని ఓ ప్రయాణికుడు డిఎంకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన సదరు డ్రైవర్, కండక్టర్లపై చిందులేస్తూ బెదిరింపులకు గురి చేశాడన్నారు. ఇలా చిన్నచిన్న తప్పిదాలకు తమను ఉన్నతాధికారులు వేధింపులు గురి చేస్తున్నారని తెల్ల బట్టలు తెల్ల బట్టలు గా నల్ల బట్టలు నల్ల బట్టలు గా చూసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని కావాలని తమ గిట్టని వారు ఫోన్ చేస్తున్నారని అది కూడా అధికారులు నిజమా కాదా అని గమనించకుండా డిపో స్క్వేర్ మెమోలు చార్జీ సీటు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ప్రాంగణం వద్ద బస్సులు ఆపిన ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఆత్రుతగా బస్సు ఎక్కే సమయంలో జారిపడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని దానికి కూడా సిబ్బంది కారణమని తమను టార్గెట్ చేస్తున్నారని వాపోతున్నారు. అదనపు డ్యూటీలు చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు

  •  ఆధార్ తో తప్పని తిప్పలు …

ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పించింది. అయితే ఆధార్ కార్డులు, ఓటరు ఐడీలను అప్డేట్ చేసుకోవాలని పలుమార్లు యాజమాన్యం ఆదేశించిన మహిళలు అవేమి పట్టించుకోవడం లేదు. బస్సులో ఎక్కామా ఆధార్ చూపించామా అన్నది తప్ప ఆధార్ కార్డు వారిదేనా లేక మరొకరిదా అన్న విషయాన్ని మర్చి పోతున్నట్లుగా మారింది పరిస్థితి. ఖచ్చితంగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం పలుమార్లు హెచ్చరికలు చేసిన అవేమీ పట్టించుకోవడం లేదు ప్రయాణికులు. దానిని సాకుగా తీసుకుని ఆర్టిసి అధికారులు కండక్టర్ లను వేధిస్తున్నారు.

  •  టార్గెట్లు లక్ష్యం లేదంటే డిపో స్పేర్

గత కొంతకాలంగా ఆర్టీసీ లో నూతన నియమాక లేకపోవడంతో ఉన్న ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నారు యాజమాన్యం. అయినా కాదనకుండా అదనపు డ్యూటీలు చేస్తున్నారు. ఈరూట్ లో ఇంత ఆదాయం తీసుకురావాలని టార్గెట్లు పెడుతున్నారు. టార్గెట్లు తేలేదు  అని అధికారుల కారణంగా ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్టిసీలో ఉద్యోగులు విశ్రాంతి లేక, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపలేక డిపోలలో విశ్రాంతి గదులకే పరిమితమై తమలో తామే మదనపడుతూ అస్వస్థతకు గురి అవుతున్నారు. ఇచ్చిన టార్గెట్ తీసుకురాకపోతే డిపో స్పేర్ తో మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనసున్న మహారాజులు తమ ఆవేదన అర్థం చేసుకుని తమను తమ కుటుంబాలకు అండగా ఉండి ఒకే కుటుంబంలో కలిసి ఉందాం ప్రగతి చక్రాన్ని ముందుకు సాగిద్దాం. ఆర్టీసీని కాపాడుకుందాం ఆదాయాన్ని సమకూర్చుకుందామంటూ చిరునవ్వుతో ప్రయాణికులను గమ్యాన్ని చేరుస్తున్నారు ఉద్యోగులు. అలాంటి వారికి ఇలాంటి తిప్పలా? అని తమ అవేదన వెల్లగక్కుతున్నారు.

More articles

Latest article