29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒడిస్సా టూ నాందేడ్

Must read

📰 Generate e-Paper Clip

. . . 20 లక్షల గంజాయి పట్టివేత

. . . ఇద్దరిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్

బాన్సువాడ, బతుకమ్మ : 

ఒడిస్సాలో పెరిగిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా నాందేడ్ కు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎన్  ఫోర్స్ మెంట్ అధికారులు  పకడ్బందీ ప్రణాళికతో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన తిరుపతి, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జెమినితాండకు చెందిన సాత్నం, శ్రీను, శంకర్, వినోద్ లు కలిసి గంజాయి రవాణా  చేస్తుండగా పట్టుకున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. విశ్వసనీయ  సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో నిజాంసాగర్ మండలం మాగి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పీయో వాహనంలో 90.8 కిలోల గంజాయి రవాణా చేస్తున్న నల్గొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన తిరుపతి, గాంధారి జెమిని తాండకు చెందిన గేలోత్ సాత్నంను అరెస్టు పట్టుకున్నారని మిగిలిన ముగ్గురు పరారయ్యారని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.20.50 లక్షలు ఉంటుందని తెలిపారు. 20 లక్షల గంజాయి పట్టుకోవడంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ సుందల్ సింగ్, ఎస్సై రాంకుమార్, కానిస్టేబుళ్లు విష్ణు, అవినాష్, మంజుల, సందీప్, అభిషేక్ లను డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.

More articles

Latest article