23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంటింటి సర్వే పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

డిచ్పల్లి, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపిస్తోందని అన్నారు. అనంతరం స్థానిక రైతు వేదికలో మంత్రి రైతులతో భేటీ అయ్యారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, పి.రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.

More articles

Latest article