23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

గోదావరికి హారతి

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ: మండలంలోని ఉమ్మెడలో గోదావరికి హారతి ఇచ్చారు. ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పాల్గొని గోదావరి  మాతకు హారతి సమర్పించారు. 11 సంవత్సరాల క్రితం రాష్ట్ర గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని 11 పుష్కర ఘాట్లలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో గోదావరికి హారతి ఇస్తున్నారు. అప్పటి నుంచి మాజీ సర్పంచ్ రాముడ  పోశెట్టి గ్రామ వీడీసీ సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వేడుకల్లో పలుగుట్ట స్వామిజీ మంగి రాములు  మహరాజ్  ఆధ్వర్యంలో శివునికి అభిషేకం చేసి గోదావరికి  హారతి సమర్పించారు. కోటపాటి నరసింహ నాయుడు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. కోటపాటితోపాటు ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఊరే బాలయ్య, రుక్మాజీ, ఆంధ్రనగర్ మాజీ సర్పంచ్ నాయుడు రామారావు, అయిలాపూర్ సుదర్శన్, చెడొల్ల  చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article