ఎల్లారెడ్డి, బతుకమ్మ : మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఎల్లారెడ్డి సీడీపీఓ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం ప్రాజెక్ట్ స్థాయిలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెలలో పోషణ పక్షం కార్యక్రమాలు ఎల్లారెడ్డి ప్రాజెక్ట్ పరిధి లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించామని తెలిపారు. పోషణ పక్షంలో మొదటి 1000 రోజుల పై దృష్టి గురించి, లబ్ధిదారుల మోడ్యూల్ ని ప్రజాదరణ పొందించుట గురించి, ఎంఏఎం/ఎస్ఎస్పీ మాడ్యుల్ అమలు ద్వారా పోషకాహార లోపం నివారించడం, పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి గురించి, అలాగే 1000 డేస్ ప్రాముఖ్యత గర్భం ధరించిన నుండి బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు గడిచే దశ గురించి పోషకాహార ప్రాముఖ్యత గురించి తెలిపారు. సీడీపీఓ మాట్లాడుతూ ముర్రు పాల ప్రాముఖ్యత గురించి,గర్భిణీ బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమoతాలు ,అన్నప్రాసన లు ,అక్షరాభ్యాసం,ప్రీ స్కూల్ కార్యక్రమాలు,గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతి, హారతి, వినోదిని, లత, ఈశ్వరి సూపర్వైజర్లు, మహిపాల్, రవి, కళ్యాణి బ్లాక్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

