0 1,378
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి న్యూసెన్స్ చేయడంతో అరెస్టు చేసినట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ యాసిర్ అరాఫత్ శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బురుడుగల్లి చెందిన జంబిలం దిలీప్ ఎలాంటి పని లేకుండా జల్సాలకు అలవాటు పడి తన తల్లిని డబ్బులు ఇవ్వమని కొట్టేవాడు. లేకుంటే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో 100 నంబరుకి కాల్ చేయగా పోలీస్ సిబ్బంది వాళ్ల ఇంటికి వెళ్లి తల్లి ని ఎందుకు కొడుతున్నావని అడిగినందుకు కాలనీవాసులను బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేశాడు. భయపడి అతని తల్లి పోలీస్ స్టేషన్ కి దరఖాస్తు ఇవ్వడానికి రాగా జంబిలం దిలీప్ వెనకాల ఇంట్లో కూరగాయలు కోసే కత్తిని తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని లేకుంటే డబ్బులు ఇవ్వమని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తన తల్లి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తను తెచ్చుకున్న కత్తితో మెడపై చాతి కుడి భాగం కోసుకున్నాడు. ఇది గమనించి పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగా ప్రభుత్వ ఆస్పత్రి లో కూడా డాక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించి న్యూసెన్స్ చేశాడు. ఇతరులను ఇబ్బందులకు గురి చేయగా అలాగే పోలీస్ స్టేషన్ ముందు వచ్చి న్యూసెన్స్ చేసిన జంబిలం దిలీప్ పై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసి కోర్టు లో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జంబిలం దిలీప్ పై ఇప్పటివరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో 4 కేసులు నమోదయి ఉన్నట్లు తెలిపారు.
0 1,378