- బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్
ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరించాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలతోఐదు వందల నలభై ఒకటి గ్రామపంచాయతీలు ఉన్నాయని, నిజామాబాద్ నూడ పరిధిలో ఇప్పటి వరకే బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ అసెంబ్లీకి సంబంధించిన 73 గ్రామాలు నూడా పరిధిలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం నూడా పరిధిని ఇంకా విస్తరించాలని చూస్తున్నారని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ తో పాటు ముడు వందల ఎనభై గ్రామపంచాయతీలను కూడా పరిధిలోకి తీసుకువచ్చి విస్తరించాలని చూస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఇటు భీంగల్ నుండి అటు బోధన్ నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి నూడా కార్యాలయానికి వచ్చి పనులు చేసుకోవాలంటే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ విస్తరన ఆపి బోధన్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మున్సిపాలిటీ, భీమ్గల్ మున్సిపాలిటీ లను డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన పరంగా ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని, మీ రాజకీయ నిరుద్యోగం కూడ భర్తీ అవుతుందని అన్నారు.ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని, గతం లో ఆర్డీఓ కార్యాలయలు జిల్లా కేంద్రం లో ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉంటుందని ఇక్కడ అర్ముర్ లో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేశారని తెలిపారు. నూడా ను విస్తరంచకుండా చూడాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. ఈ పత్రిక సమావేశం లో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అరె రాజేశ్వర్ పాల్గొన్నారు.
