. . ఆర్మూర్ పోలిస్ స్టేషన్ కు తరలివచ్చిన గ్రామస్థులు
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామ సర్పంచ్ గా సట్లపల్లి సవిత అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు సుర్బిర్యాల్ గ్రామస్థులు తరలివచ్చారు. సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా సుమారు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. హెచ్ ఎస్ ఓ రవికుమార్ గ్రామస్తులను సమ్ముదాయించే ప్రయత్నం చేసిన సుర్బిర్యాల్ వాసులు న్యాయం కోసం పట్టుబట్టారు. చేయని అభివృద్ధి పనులకు చేసినట్టు తప్పుడు బిల్లులు సృష్టించి, నాలుగు కోట్ల అవినీతికి పాల్పడినట్టు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామానికి సంబంధించిన భూమిలో సొంతంగా మడిగెలు నిర్మించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. సర్పంచ్ అక్రమ నిర్మాణాలని గ్రామ సర్వ సమాజ్ జప్తు చేస్తుకుందని, ఇకమీదట సర్పంచ్ అవినీతి బాగోతం అంతా బయటపడే వరకు గ్రామమంతా ఏకమై ఒక తాటిపై పోరాడుతామని వారన్నారు. జిల్లా ధికారులు విచారణ చేపట్టి అవినీతిని నీకు తేల్చాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
