రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దాల్ మల్క బాబయ్య కుమార్తె దాల్ మల్క సోని వివాహం కొరకు స్థానిక బీజేపీ నాయకులను వారి కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం కొరకు ఆశ్రయించగా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి తన వంతు ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, బాన్సువాడ బీజేపీ సీనియర్ నాయకులు వాంకర్ రామరాజ్, రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు భోజిగొండ అనిల్, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, బూత్ అధ్యక్షులు దాల్ మాల్క గోపి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
