- సోషల్ మీడియాకే పరిమితమైన ఆర్మూర్ ఎమ్మెల్యే
- గెలిచిన నాటి నుండి ఆర్మూర్ నియోజకవర్గాన్ని కన్నెత్తి చూడలే
- సోయిలేని మాటలు మానుకో
- ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : ప్రోటోకాల్ కి పరిమితమైన ఎమ్మెల్యే ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక సోయి లేని మాటలు మాట్లాడుతున్నాడని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ 15 నెలల కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలతో తత్సంబంధాలతో ముందుకు వెళ్తూ, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తున్నానని చెప్పారు. గడిచిన 10 ఏండ్లు జీవన్ రెడ్డి ఆగడాలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారని అన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే కనిపించే రాకేష్ రెడ్డి బోగస్ కంపెనీ అని ప్రజలు ఇప్పటికే తేల్చారన్నారు. పేద ప్రజలను, కుల సంఘాలను ఇంటి గేటు లోపలికి రానివ్వవనే పేరు సార్థకమైందని అన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలోనే ఆలోచించడం కాదని దమ్ముంటే ఎంపీ అరవింద్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో వాదించి కేంద్ర ప్రభుత్వ నిధులు తేవాలని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటల ప్రకారం ఒక్క రూపాయి కే వైద్యం, గ్రామానికి 10 ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు గతంలో నియోజకవర్గం లోని వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక కోటి నిధులు వెచ్చించారన్నారు.15 నెలల కాలంలో ఆర్మూర్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన సుమారు 50 లక్షలు నిధులు పైనే తెచ్చానన్నారు. అంకాపూర్ విడీసీ సభ్యులు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ను తమ గ్రామానికే తెచ్చే విధంగా చేయాలని నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. నిజామాబాద్ జిల్లాకు అమలైన నవోదయ స్కూల్ అంకాపూర్ కు వచ్చేలా ఎంపీ అరవింద్,ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేయాలని చెప్పానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గెలిచిన నాటి నుండి నియోజకవర్గాన్ని కన్నెత్తి చూడలేదని, బోగస్ సోయలేని మాటలు మాట్లాడొద్దని, ఆర్మూర్ అభివృద్ధిలో నీ వంతు పాత్ర పోషించాలని హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణానికి 32.57 కోట్ల, 14.25 కోట్ల, 4 కోట్ల నిధులు మినీ ట్యాంక్ బండ్ మొత్తం కలిపి 50 కోట్ల 82 లక్షల నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారని తెలిపారు.
