27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎలక్షన్ రూల్స్ ప్రకారం నామినేషన్లను స్వీకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ అంకిత్

 

భీంగల్‌, బతుకమ్మ :

 

అభ్యర్థుల నుండి నామినేషన్లను అధికారులు స్వీకరించేటపుడు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నాయో లేదో చూసుకొని ఎలక్షన్ రూల్స్ ప్రకారం నామినేషనలను స్వీకరించాలని ఎలక్షన్ అధికారులకు జాయింట్ కలెక్టర్ అంకిత్ సూచించారు. బుధవారం భీంగల్‌ పట్టణంలోని ఎంపీడీవో, ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా మొదటి రోజు నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించి ఎంతమంది అభ్యర్థులు, ఏయే వార్డుల నుండి నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం హెల్ప్ డెస్క్ ను కూడా ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, భీంగల్‌ ఇంచార్జి సీఐ గా ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఏర్గట్ల, భీంగల్‌ ఎస్సై లు, తిరుపతి, ప్రశాంత్, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

 

Nominations should be received as per the election rules.

More articles

Latest article