27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ లో భారీ చేరికలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను గమనించిన బిజెపి, బీఆర్ఎస్, తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధిక సంఖ్యలో చేరుతున్నారని,  అందులో భాగంగానే 23వ డివిజన్ బిజెపి నుండి కొత్త వేణుగోపాల్, 24వ డివిజన్ బిఆర్ఎస్ నుండి అంతా రెడ్డి గౌతమి, 57వ డివిజన్ బిఆర్ఎస్ నుండి రేహాన్ చేరారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే లక్ష్యంగా, ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి ద్వారా ఖచ్చితంగా నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని బొబ్బిలి రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article