29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బీజేపీలో సగం సిట్టింగ్ లకు నో టికెట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మున్సిపల్ కార్పేరేషన్ లో జంపింగ్ జిలానీలకు టికేట్ల కోత

. . . గత కార్పొరేటర్లలో వసూళ్ళ రాయుళ్లకు టికెట్ కేటాయింపులో బ్రేక్

. . . ఎలక్షన్ లో ఖర్చు చేసి వసూళ్ళ రాయుళ్ళకు చెక్

. . . నేరచరిత్ర ఉన్న టికెట్ వచ్చే అవకాశాలు లేనట్లే

నిజామాబాద్, బతుకమ్మ :

భారతీయ జనతా పార్టీ ఇందూర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తుంది. మిగితా రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఎన్నికల బరిలో దిగింది. గత పాలకవర్గంలో 28 సీట్లతో అత్యధిక కార్పొరేటర్లుగా గెలిచిన కమలం పార్టీ ఈసారి ఎలాగైనా మేయర్ గద్దెను బీజేపీ గెలుచుకోవాలని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నిజామాబాద్ లో రాజకీయం వేడెక్కిందంటే అందుకు బీజేపీయే కారణం.60 డివిజన్ లు కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్న వారికి టికేట్ ల కేటాయింపులో  పారధర్శకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పార్టీ టికెట్ల కేటాయింపు , స్థానికంగ నాయకత్వాలకు లేదని  పార్టీ కోసం పని చేసిన వారిని గెలుపు గుర్రాలకే సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు జరుగుతుందని మూడు నెలల ముందుగానే పార్టీ శ్రేణులకు సూచనప్రాయంగా సమాచారం అందించారు. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ నగారా మోగుతుందని ప్రచారం జరుగగానే చాలా మంది టికెట్ల కోసం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో పాటు ఎంపీ అరవింద్ ధర్మపురిల వద్ద పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కానీ పార్టీ మాత్రం ఈసారి మేయర్ పీఠం దక్కించుకునేందుకు అందుకు సమర్థులైన వారిని ఎంపిక చేయడంతో పాటు గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయించేందుకు సన్నద్దమైనట్లు తెలిసింది. మేయర్ స్థానం మహిళలకు కేటాయించడంతో అస్థానంలో ఎవ్వరిని బరిలో దించాలని, అందులో గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించినట్టు తెలిసింది…

No ticket for half of the sittings in BJP

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత పాలకవర్గంలో 28 సీట్లు గెలిచిన బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ 2026లో జరుగనున్న ఎన్నికల్లో అందులో సగం మందికి టికెట్లు కట్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. అందుకు కారణాలు లేకపోలేదు. గడిచిన పాలకవర్గంలో కమలం పార్టీ తరపున గెలిచిన డజన్ మంది కార్పొరేటర్లు బీజేపీని వీడి కారెక్కారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఘర్ వాపసీ పేరిట తిరిగి పార్టీలో చేరారు. ఆనాడు వారికి ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం జంపింగ్ జిలానీలకు టికెట్లను ఇచ్చేది లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాల భొగట్టా. తమకు పార్టీలో సీనియర్ల అండ ఉందని టికెట్లు వస్తాయని అప్పుడే ప్రచారం మొదలుపెట్టిన వారికి కూడా బీజేపీ షాక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతేగాకుండా బీజేపీలో ఉన్న మరికొందరు కార్పొరేటర్లు పార్టీకి చెడ్డపేరు తేవడానికి కారకులయ్యారు. ప్రధానంగా డివిజన్లలో పేదలను కూడా వదలకుండా ముక్కుపిండి డబ్బులు వసూల్ చేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు. సొంతింటి  నిర్మాణం చేపట్టిన వాణిజ్యం కోసందుకాణం తెరిచిన కార్పొరేటర్లు డబ్బులు వసూల్ చేయడమే కారణం. కొందరు కార్పొరేటర్లు ఇంటి నిర్మాణం కోసం ఇసుక, కంకర లోడ్ కాగానే తమకు డబ్బులు ఇస్తేనే నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం లేకపోతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఉసిగొలిపి నిర్మాణ  పనులు  ఆపిన ఘనత కలిగి ఉన్నారు. మరికొందరు అపార్ట్ మెంట్ లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తేనే వదలడం, వెంచర్ల నిర్వాహకుల వద్ద లక్షలకు లక్షలు వసూల్ చేసినా ఘనతను కలిగి ఉన్నారు. కొందరు కార్పొరేటర్ల డాక్టర్లను పీడించుకు తిన్న ఘనత విషయం ఎంపీ , ఎమ్మెల్యే వరకు వెళ్లిందంటే వారి పని తీరు తెలిసిపోయింది. వారికి ఈసారి ఎన్నికల్లో బీజేపీలో టికెట్ అసాధ్యమని ప్రచారం మొదలయింది. ఇటివల బల్ధియా ఎన్నికల సన్నహక సమావేశంలో బిజేపి టికేట్ లను ఎవ్వరికి కేటాయించిన పార్టి అదేశానుసారం పనిచేసి గెలిపించాలని , పక్కచూపులు చూడటం, పార్టి వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరికలు తాజా మాజీలకే అని పార్టి వర్గాలు చెబుతున్నాయి.

No ticket for half of the sittings in BJP

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ తరపున టికెట్లను ఆశించే వారికి ఇప్పటికే కొన్ని ప్రామాణికలు తీసుకుని టికెట్లను కేటాయించేందుకు సిద్దమైనట్లు సమాచారం. బల్ధి యా ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి గెలిచిన తర్వాత వాటిని రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేసే వారిని గుర్తించే పనిలో పడినట్లు తెలిసిందే. అంతేగాకుండా ఈసారి టికెట్లు ఆశిస్తున్న వారిలో నేరచరిత్ర ఉన్న వారు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఖిల్లా మండలం పరిధిలోని పలువురు అభ్యర్థులకు తీవ్రమైన నేరచరిత్ర ఉంది. ప్రధానంగా ఓ అభ్యర్థి ఆదాయ వనరు కేవలం పత్తాలాట, బెట్టింగ్ అని అంతా కోడైకూస్తోంది. బీజేపీలో పెద్దల అండ ఉందని, తనకు టికెట్ గ్యారెంటీ అని ఇప్పటికే సతీమణిని బరిలో దించేందుకు ప్రచారం చేస్తున్న నేత వ్యవహర శైలి చిట్టా పార్టీ వద్ద ఉన్నట్లు తెలిసింది. వందల మంది అమాయకుల కుటుంబాలను బెట్టింగ్, పత్తాలాట ద్వారా నాశనం చేసిన వ్యక్తి బీజేపీలో కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వర్నిరోడ్డులోని ఓ డివిజన్ లో బరిలో నిలిచేందుకు తహతహలాడుతున్న బూత్ స్థాయి నేతకు తీవ్రమైన నేరచరిత్ర ఉంది. పోలీసుల పేరిట వసూళ్ళతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో పంచాయితీల పేరిట అమాయకులను వేదించిన ఘనత కలిగి ఉన్నారు. ఫేక్ కరెన్సీ వ్యవహరంలోనూ గతంలో పలువురు నేరస్తులతో కలిసి దందాలు నిర్వహించిన చిట్టా కూడా పార్టీకి చేరింది. నీలకంఠేశ్వర మండలం పరిధిలోని మరో నేత ఏకంగా పత్తాలాట నిర్వాహణలో కాంగ్రెస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని నిర్వాహుకుడిగా చెలామణి అవుతున్నాడు. పత్తాలాటతో పాటు ఇతర వ్యాపకాలన్నీ కాంగ్రెస్ నాయకులతో చేస్తున్న ఆ తాజామాజీ వ్యవహర శైలికూడా పార్టీ వద్ద రికార్డుల్లో భద్రంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి నేరచరితులకు, తాజాగా ఖర్చు చేసి గెలిచిన తర్వాత వసూల్ చేద్దామనుకున్న వారికి ముందుగానే టికెట్ కేటాయింపుల్లోనే చెక్ పెట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

 

More articles

Latest article