27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రయివేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • డిచ్ పల్లి ఎంఈఓ శ్రీనివాస్

 

డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రయివేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు అని డిచ్ పల్లి ఎంఈఓ శ్రీనివాస్ అన్నారు. జడ్పీహెచ్ఎస్, యూపీఎస్ హరిజనవాడ పాఠశాలల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనపూర్ గ్రామంలో బడి బాట సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తు విద్యార్థులకు మెరుగైన జీవన విధానానికి తొడపాడుతుంది అని అన్నారు. మన మండలంలో పిల్లల తల్లి తండ్రులు పక్క ఉన్న వారిని చూస్తూ, వీరికి తహత లేకున్నా అప్పులు చేసి మరి ప్రయివేట్ బడుల్లో చేర్పించి, చివరకు వారి చదువు పూర్తి కాకుండానే మానేస్తున్నారు అని అన్నారు. జడ్పీహెచ్ఎస్ ఘనపూర్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతు మా పాఠశాలలో విద్యార్థులకు మేము మా స్నేహితుల సహకారం తో ప్రయివేట్ దిటుగా విద్యార్థులందరికి స్కూల్ యూనిఫామ్,స్పోర్ట్స్ డ్రెస్ ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు. చదువులో కూడ ప్రయివేట్ దిటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మొన్న జరిగిన ఎస్సెస్సీ పరీక్షల్లో 28 రాస్తే 27 విద్యార్థులు పాసయ్యారని అందులో ఒక్కరికి 493 మార్కులు వచ్చాయని అన్నారు. రాబోవు రోజుల్లో మా పాఠశాలను మండలం లోనే ప్రథమ స్థానం సాధిస్తామని అన్నారు. వాసరి సాయినాథ్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్న కొందరు తల్లి తండ్రులు ప్రయివేట్ పాఠశాలలో చేర్పించి అప్పుల పాలవుతున్నారని అన్నారు. ప్రయివేట్ విద్య కు చేసే ఖర్చు, అదా చేస్తే అమ్మాయిలకు పెండ్లికి, అబ్బాయిలకు బిజినెస్ కు ఉపయోగం అవుతుందన్నారు. అలాగే ప్రయివేట్ లో చదివిన విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు మానసిక దైర్యం పేరుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హరిజన వాడ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, రామకృష్ణ, వీడీసీ సభ్యులు గంగాధర్, తిరుపతి, మహీందర్, యువత మోహన్, గంగమోహన్, 40 ప్రజలు పాల్గొన్నారు.

No private school, government school is the best.15247

More articles

Latest article