ప్రయివేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు

డిచ్ పల్లి ఎంఈఓ శ్రీనివాస్   డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రయివేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు అని డిచ్ పల్లి ఎంఈఓ శ్రీనివాస్ అన్నారు. జడ్పీహెచ్ఎస్, యూపీఎస్ హరిజనవాడ పాఠశాలల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనపూర్ గ్రామంలో బడి బాట సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తు విద్యార్థులకు మెరుగైన జీవన విధానానికి తొడపాడుతుంది అని అన్నారు. మన మండలంలో పిల్లల...