26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కూటమిదే జీవీఎంసీ మేయర్ పీఠం

Must read

📰 Generate e-Paper Clip

విశాఖ, బతుకమ్మ : ఏపీలోని మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై ’కూటమి‘ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ చార్జి కమిషనర్, కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యలు ఉండగా, సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరందరు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. కాగా, వైసీపీ నుంచి కార్పొరేటర్లు పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. మరోవైపు వైసీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు.

More articles

Latest article