వెబ్ న్యూస్, బతుకమ్మ : మే నెలలో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుందని కేదార్ నాథ్, బద్రినాథ్ ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. ఈమేరకు యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. మే 2న కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు, మే 4న బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి..?
చార్ ధామ్ యాత్ర అంటే (యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్) నాలుగు పవిత్ర ప్రదేశాలను సందర్శించేందుకు చేసే యాత్ర.. ఈ నాలుగు ప్రవిత్ర క్షేత్రాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర. యమునోత్రి నుంచి ప్రారంభమై, గంగోత్రి, కేదార్‌నాథ్ గుండా వెళ్లి బద్రీనాథ్ దర్శనంతో ఈయాత్ర ముగుస్తుంది.
