నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
జే ఈ ఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో నారాయణ (నిజామాబాద్) జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారు. సోమవారం నాటి ఫలితాలలో క్రాంతికుమార్ ఆలిండియా 257ర్యాంకు, ఎమ్. విజయ్ 345ర్యాంక్ , ఆర్. రాంచరణ్ 732 ర్యాంక్, పల్లెర్ల విరాజ్ 2899 ర్యాంక్, శ్రీ చరణ్ ఆదిత్య 9150 ర్యాంక్ లు సాధించారు.

కళాశాల యాజమాన్యం క్యాంపస్ లో ఐఐటీ ర్యాంకర్స్ ని అభినందించారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడం అనేది మన జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి , డీన్ మంజుల , ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ అన్నారు.

ఇటీవల ప్రకటించిన జూనియర్ ఇంటర్ తెలంగాణ ఫలితాలలో గాట్ల వరెణ్య 469 మార్కులతో స్టేట్ 1 ర్యాంక్ సాధించి నిజామాబాదు జిల్లా ఖ్యాతిని నిజామాబాదు నారాయణ చాటిందని ఏజీమ్ లక్ష్మారెడ్డి తెలిపారు.

అలాగే చంద్ర వర్ధన్ 468, కదం అక్షర 468, భాశెట్టి తన్మాయ్ 466, అమృత వర్షిణి 466, శ్రీనిధి 465, ఇలా 18 మంది విద్యార్థులు 470 కి గాను 460 పైగా మార్కులు సాధించారు.

ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ బైపీసీ 440 మార్కులకు గాను 438 ,436 వంటి టాప్ మార్కులు పొందారు. అలాగే సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు కాను 994 మార్కులతో అయేషా ఆఫీఫా నిజామాబాదు జిల్లా మొదటి మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు.

అలాగే సింధు హర్షిని 992, సద్ధి అక్షిత 992, సిద్ది 990 , ఇలా ఎంపీసీ ,బైపీసీ లో కూడా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణం. ఇలాగే ఎంసెట్ లో 10వేల లోపు 19 మంది జెఈఈ మెయిన్ ఫలితాలలో 25 మంది క్వాలిఫై నీట్ ఫలితాలలో 8 ఎమ్ బి బి ఎస్ సెలెక్షన్స్.. ఇలా ఏ పోటీ పరీక్షలైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రమీల కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
