27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అనివార్య పరిస్థితిలో నష్టం సంభవిస్తే తక్షణమే స్పందించేలా కార్యచరణ ఉండాలని తెలంగాణ ముఖ్య మంత్రి రేంవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షపాత పరిస్థితి, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై వారిని చైతన్య పరచాలని అధికారులకు సూచించారు. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు వివరించాలని కోరారు.  సాగునీటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా తీశారు. గేట్లు, ఇతర నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.

 

Measures must be taken to prevent any damage.

More articles

Latest article