నిజామాబాద్ బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లాలో ఇటీవల ఐసీస్ సంబంధాలు కలిగిన యువకుడి అరెస్టు. నవీపేట్ లో నిమజ్జనం సందర్భంగా యువకుడి పై కేసు నమోదు అరెస్టు విషయంలో ఎంపీ అరవింద్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన విషయం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో సమాజంలో చీలికలు వస్తున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ ఐ, ఐ సి స్ ఉగ్రవాదుల శిక్షణ తరగతులు కనిపించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ విషయంలో హిందువులు ముస్లింలు అన్న విషయంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆరోపించారు. నవీపేట్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం రోజు ఒక యువకుడు శోభాయాత్ర సందర్భంగా తీసిన ఫోటో విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆగమేగాల మీద అరెస్టు చేశారన్నారు. ఇదే విషయంలో స్థానిక మైనార్టీలు కొందరు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా ర్యాలీ నిర్వహించి ఆందోళన చేసిన అలాంటివారిపై కేసులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల పండుగలు ఉత్సవాల విషయంలో ఆంక్షలు లేదా ఒత్తిళ్లు ఎక్కువగా అయ్యాయని అన్నారు. హిందూ ముస్లింల విషయంలో గంగ జామున తెహజీబ్ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు హిందువుల విషయంలో గంగ జమున ఎండుకపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జిల్లాలో ఐసిస్ ఉగ్రవాదుల ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా లవ్ జిహాద్ కోసం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్వాడి గో బ్యాక్ అంటున్నారని మరి ఇక్కడ ఉన్న టర్కీ,బంగ్లాదేశ్,మయన్మార్ వాసులను వెళ్లగొడదమని ప్రశ్నించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని ఎంపీ అరవింద్ అన్నారు. జిల్లా లో ఉగ్రవాద చర్యలు అరికట్టాలని సీపీ సాయి చైతన్యను కోరమని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఏర్పడిందన్నారు.
